ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్‌ మానిటైజేషన్‌పై సీఐటీయూ నిరసనలు

ABN, First Publish Date - 2021-10-22T06:17:39+05:30

కేం ద్ర ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమలన్నీంటిని విక్రయించే నిర్ణయంపై సీఐటీయూ నిరసనకు దిగింది.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, అక్టోబరు 21: కేం ద్ర ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమలన్నీంటిని విక్రయించే నిర్ణయంపై సీఐటీయూ నిరసనకు దిగింది. నేషనల్‌ మానిటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ గురువారం ఆర్‌జీ-1 పరిధిలోని బొగ్గునులపై కార్మికులు నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలుపడంతో పాటు స్థానిక ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడు తూ నేషనల్‌ మానిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వరం పరిశ్రమలను స్వదేశి, విదేశీ గుత్తపెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మాలని నిర్ణయించింద ని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యతిరేక చర్యలను మానుకోవాలన్నారు. ఈ నిరసనలో సీఐటీయూ అధ్యక్షులు తు మ్మల రాజారెడ్డి, ప్రధానకార్యదర్శి మధు, నాయకులు వై యాకయ్య, వేల్పుల కుమారస్వామి, ఎర్రబెల్లి ముత్యంరావు, ఐద్వా జిల్లా కార్యద ర్శి మహేశ్వరి, జీ జ్యోతి, రామాచా రి, మెండె శ్రీనివాస్‌, అన్నం శ్రీని వాస్‌, నంది నారాయణ, రవి, దుర్గాప్రసాద్‌, శివరాంరెడ్డి, సురేష్‌, సమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising