ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి

ABN, First Publish Date - 2021-05-09T05:17:13+05:30

రాష్ట్రంలో ము స్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

కానుకలను అందజేస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముస్లింలకు రంజాన్‌ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, మే 8: రాష్ట్రంలో ము స్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని తిరుమల్‌నగర్‌, లక్ష్మీనగర్‌, గాంధీనగర్‌, మార్కండేయకాలనీలోని మసీదుల్లో ముస్లీంలకు రంజాన్‌ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లింలకు రంజాన్‌ కానుకలను పం పిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేద ముస్లింల వి వాహానికి అండగా నిలుస్తూ షాదీముబారక్‌ పథకాన్ని అమలు చేసి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారని, పేద విద్యార్థుల కోసం ఉచితంగా విద్యతో పాటు విదేశీ చదువుల కోసం రుణాల ను అందిస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.1.20లక్షలు ఖర్చు చేస్తుందని, రామగుండం నియోజకవర్గంలో మసీదులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ అనీల్‌కుమార్‌, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్‌, బాల రాజ్‌కుమా ర్‌, మేకల సదానందం, కోఆప్షన్‌ సభ్యు లు మహ్మద్‌ రఫిక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, మెతుకుదేవరాజ్‌, జాహిద్‌పాషా, సిరాజుద్దీన్‌, అబ్దుల్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising