ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వ్‌ ఈవీఎంల తనిఖీ

ABN, First Publish Date - 2021-10-18T05:53:18+05:30

హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా వినియోగించేందుకు రిజర్వు ఈవీఎంల తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.

ఈవీఎంలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌, వివిధ పార్టీల ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా వినియోగించేందుకు రిజర్వు ఈవీఎంల తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎంల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్‌కు చేరుకున్న 200 బ్యాలెట్‌ యూనిట్లను, ఈవీఎంల గోదాములో ఉన్న వీవీ ప్యాట్లను తనిఖీచేసి వినియోగించేందుకు రిజర్వులో సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. ఈ నెల 18వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఎఫ్‌ఎల్‌సీ నిర్వహిస్తారని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మాధవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు చీటి రాజేందర్‌ రావు, సత్తినేని శ్రీనివాస్‌, నాంపల్లి శ్రీనివాస్‌, గాలి అనిల్‌ కుమార్‌, కళ్యాడపు ఆగయ్య, రాజేశం, కిషన్‌, మహమ్మద్‌ అఖిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising