ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్‌ కుటుంబాల బాధలు సీఎంకు పట్టవా?

ABN, First Publish Date - 2021-01-17T04:39:30+05:30

గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబాల బాధలు రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గల్ఫ్‌ కార్మికుల కోసం ఎన్నారై పాలసీ రూపొందించాలి 

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జనవరి 16: గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబాల బాధలు రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. గల్ప్‌ కార్మి కుల మహాపాదయాత్ర శనివారం జిల్లా కేంద్రంలో సాగింది. టౌన్‌లో ర్యాలీ నిర్వహించిన అనంతరం, గల్ఫ్‌ కుటుంబాల జనభేరి పేరుతో స్థానిక ఎల్‌జీ గార్డెన్‌లో సమావేశం నిర్వ హించారు. ఈ  సందర్భంగా సమావేశానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్య నారాయణ రావు, టీడీపీ జిల్లా ప్రదాన కార్యదర్శి మహంకాళి రాజన్న, వేములవాడ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఆది శ్రీనివాస్‌ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించి గల్ఫ్‌లో మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ కార్మికులకు టుంబాల బాధలు సీఎంకు కనిపించడం లేదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ కింద 100కోట్ల బడ్జెట్‌ పెట్టి గల్ఫ్‌ కుటుంబాలను ఆదు కోవాలన్నారు. వచ్చే శాసన మండలి సమావేశాల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ గురించి ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, పెద్ద సంఖ్యలో కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-17T04:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising