ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెత్తురోడుతున్న రహదారులు

ABN, First Publish Date - 2021-01-19T05:43:52+05:30

జిల్లాలోని పలు రహ దారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతు న్నాయి. ప్రధానంగా వేములవాడ కమాన్‌, రగుడు చౌరస్తా, సిరిసిల్ల బైపాస్‌లలో లారీలను, ఇతర వాహ నాలను రాత్రి వేళల్లో పార్కింగ్‌ చేయడంతో ప్రమా దాలు జరుగుతున్నాయి.

లారీని ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన ద్విచక్రవాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇష్టారాజ్యంగా భారీ వాహనాల పార్కింగ్‌

- ప్రమాదకరంగా డివైడర్‌లు

- తరచూ ప్రమాదాలు

సిరిసిల్ల క్రైం, జనవరి 18:  జిల్లాలోని పలు రహ దారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతు న్నాయి. ప్రధానంగా  వేములవాడ కమాన్‌, రగుడు చౌరస్తా, సిరిసిల్ల బైపాస్‌లలో లారీలను, ఇతర వాహ నాలను రాత్రి వేళల్లో పార్కింగ్‌ చేయడంతో ప్రమా దాలు జరుగుతున్నాయి.   మరోవైపు మద్యం సేవించి, సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడంతో పాటు అతివేగం ప్రాణాలు తీస్తున్నాయి. రాజన్న సిరి సిల్ల జిల్లాలోని 13 పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో జనవరి 2020 నుంచి జనవరి 2021 వరకు 192 రోడ్డు ప్రమా దాలు చోటు చేసుకున్నాయి.  75 మందికిపైగా మృతిచెందగా 172 మంది గాయపడ్డారు.  ఇటీవల సిరిసిల్లలోని సర్ధాపూర్‌ వద్ద ఆగి ఉన్న స్కూటీని డీసీఎం వ్యాన్‌ ఢీ కొనడంతో ఎల్లారెడ్డిపేటకు చెందిన అల్లంరాజేశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం తెల్లవారు జామున వేములవాడ కమాన్‌ వద్ద ఆగి ఉన్న బొగ్గులారీని ఢీకొని  వెంకటేశ్‌, అజిత్‌ మృతిచెండం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గతంలో చంద్రంపేట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు.  

వేములవాడ నుంచి సిరిసిల్ల రహదారిలోని అయ్యప్పఆలయం, కమాన్‌చౌరస్తా, రగుడు చౌర స్తా, చంద్రంపేట చౌరస్తా, తంగళ్లపల్లి వైపు వెళ్లే మానేరువంతెన చౌరస్తా, సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్‌లేక్‌, అంబేద్కర్‌చౌరస్తా, మున్సిపల్‌ కార్యా లయం, నేతన్న విగ్రహం, వెంకంపేట రోడ్డు, సిరిసిల్ల, కామారెడ్డి రోడ్డు,  కొత్తచెరువు, పద్మ నాయక కల్యాణమండపం, ఆర్టీవో కార్యాలయం వద్ద మలుపులు, చౌరస్తాలు ప్రమాదాలకు నెలవ వుతున్నాయి.  డివైడర్‌లను వదిలివేయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొత్తచెరువు వద్ద  డివైడర్‌ ప్రారంభంలో ఆరు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో వాహనాలు అతి వేగంగా వచ్చి డివైడర్‌లను ఢీకొన్న సంఘటనలే ఉన్నాయి. పద్మనాయక కల్యాణమండపం వద్ద  ఓ కారు డివైడర్‌కు ఢీకొని నుజ్జునుజ్జయ్యింది.  


రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు

- రాహుల్‌హెగ్డే, ఎస్పీ

రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ వాహనదారుడు డ్రైవింగ్‌లో జాగ్రత్తలు పాటిచాలి. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దు. అర్ధరాత్రి  ప్రయాణాలు తగ్గించాలి.  60 కిలోమీటర్ల వేగంగా కంటే ఎక్కువ  వెళ్లకూడదు. 

Updated Date - 2021-01-19T05:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising