కేంద్ర బలగాలతో హుజూరాబాద్ దిగ్బంధం
ABN, First Publish Date - 2021-10-29T05:44:05+05:30
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి. వారం రోజుల క్రితం రెండు సీఏపీఎఫ్ కంపెనీలు కేంద్రం నుంచి దిగాయి.
- అన్ని గ్రామాల్లో పోలీసుల మోహరింపు
హుజూరాబాద్, అక్టోబరు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి. వారం రోజుల క్రితం రెండు సీఏపీఎఫ్ కంపెనీలు కేంద్రం నుంచి దిగాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కంపెనీలతో కవాత్‌లు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా తీసుకోవడంతో హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులందరూ ఇక్కడి నుంచి వెళ్లారు. గురువారం 18 కేంద్ర కంపెనీల బలగాలు దిగాయి. శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు.
Updated Date - 2021-10-29T05:44:05+05:30 IST