ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ABN, First Publish Date - 2021-10-15T07:24:52+05:30

తంగళ్లపల్లి మండలలోని బస్వాపూర్‌, బాలమల్లుపల్లె, నేరేళ్ల, జిల్లెల్ల తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బస్వాపూర్‌లో బతుకమ్మ అడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంగళ్లపల్లి, అక్టోబరు 14: తంగళ్లపల్లి మండలలోని బస్వాపూర్‌, బాలమల్లుపల్లె, నేరేళ్ల, జిల్లెల్ల తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీల అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాటు చేసిన బతుకమ్మలు అడి బతుకమ్మ తెప్పలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాల్లో అయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

ఇల్లంతకుంట : తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండలంలోని నాలుగు గ్రామాల్లో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగాయి. మిగతా గ్రామాల్లో గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడిపాడారు. సోమారంపేట గ్రామంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం గ్రామాల్లోని పొలిమేరలలో ఉన్న బతుకమ్మ తెప్పలలో నిమజ్జనం చేశారు.వాయినాలు పంచుకొని సల్లంగా చూడు బతుకమ్మ అంటూ ఇంటికి వెనుదిరిగారు. ఎస్సై రఫీక్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, హరిదా్‌సనగర్‌ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. జడ్పీటీసీ లక్ష్మన్‌రావు, సర్పంచులు అమృత, వజ్రమ్మలతో పాటు మహిళలు బతుకమ్మలను పేర్చారు. నూతన దుస్తులను ధరించి ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆటలు ఆడారు. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడలు ఉ య్యాలో.. గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. యువతులు, మహిళలు, చిన్నారులు దాండియా, కోలాటాలు ఆడారు. పల్లెలు పూల వనాన్ని తలపించాయి. అనంతరం గ్రామ శివారుల్లోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 గంభీరావుపేట : గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో గురువారం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ పండగ సంబరాల్లో బాగంగా బతుకమ్మలను ప్రధాన కూడలిలో పెట్టి బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

వేములవాడ టౌన్‌ : వేములవాడ మండలంలోని ఆ రెపల్లి, సంకెపల్లి, రుద్రవరం, గొల్లపల్లి, నాంపల్లి, చీర్లవంచ, చింతలఠాణ, చంద్రగిరి, మారుపాక, శాభా్‌షపల్లి గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు ఎంపీపీ బూర వజ్రవ్వబాబు, జడ్పీటీసీ మ్యాకల రవి హాజరయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్పంచ్‌లు, కౌన్సిలర్లు నవీణరాజు, జింక సనీతవేణు, ఊరడి రాంరెడ్డి, కొండపల్లి వెంకటరమణరావు, నీలం కల్యాణిశేఖర్‌, జడల లక్ష్మీశ్రీనివాస్‌, పండుగ ప్రదీప్‌, రాసూరి రాజేశం, చెన్నమనేని స్వయంప్రభ, రంగు సత్తెమ్మరాములు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

 

Updated Date - 2021-10-15T07:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising