ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరెస్ట్‌లు.. నిరసనలు

ABN, First Publish Date - 2021-06-17T06:39:00+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం మంత్రుల పర్యటనలో నిరసనలు, అరెస్ట్‌లు కొనసాగాయి. పుర పాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవన నిర్మాణాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ తర్వాత అర్హత ఉండి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందలేని వారు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రగుడులో నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం మంత్రుల పర్యటనలో నిరసనలు, అరెస్ట్‌లు కొనసాగాయి. పుర పాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవన నిర్మాణాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ తర్వాత అర్హత ఉండి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందలేని వారు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వినతిపత్రాలతో నిరసన తెలుపుతుండగా మంత్రి కేటీఆర్‌ వారి వద్దకు వెళ్లి డబుల్‌ బెడ్‌రూంలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్‌ బెడ్‌రూం  ఇళ్లు నిర్మించిన స్థలం తమదని రాజిరెడ్డి, పద్మ కేటీఆర్‌ను కలవడానికి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయడంతో వాగ్వావాదం చోటు చేసుకుంది. చివరకు మంత్రి కేటీఆర్‌ను కలిసి తమకు పరిహారం ఇవ్వాలని కోరారు. బోయినపల్లి మండలంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా నిరసనలు తెలుపుతారని మిడ్‌ మానేరు నిర్వాసితులను, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2021-06-17T06:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising