ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాలలు, పాఠశాలల పున: ప్రారంభానికి ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-01-17T05:32:05+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10, ఇంటర్‌, డిగ్రీ, తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని, తరగతి గదులను శుభ్రపరిచి శానిటైజ్‌ చేయించాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పాఠశాలలు, కళాశాలల పున:ప్రారంభంపై అదనపు కలెక్టర్‌ అంజయ్య, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - ఫిబ్రవరి 1 నుంచి తరగతులు  

- కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 

- కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10, ఇంటర్‌, డిగ్రీ, తరగతుల ప్రారంభానికి  ఏర్పాట్లు చేయాలని, తరగతి గదులను శుభ్రపరిచి శానిటైజ్‌ చేయించాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌  ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పాఠశాలలు, కళాశాలల పున:ప్రారంభంపై అదనపు కలెక్టర్‌ అంజయ్య, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.  కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన కల్పించడంతో పాటు లిఖిత పూర్వక సమ్మతి పత్రం తీసుకోవాలన్నారు. విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఒకే తరగతి వారికి రెండు గదులను ఉపయోగించాలన్నారు. రెసిడెన్షియల్‌ హాస్టల్‌లో ఇంకా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అదనపు కలెక్టర్‌ అంజయ్య, డీఈవో రాధాకిషన్‌, ఇంటర్మీడియెట్‌ అధికారి సత్యవర్ధన్‌రావు, డీపీవో రవీందర్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోమన్‌రావు, సిరిసిల్ల, వేములవాడ కమిషనర్లు సమ్మయ్య, శ్రీనివాస్‌, రెసిడెన్షియల్‌ పాఠశాల జిల్లా అధికారి జాక్వలిన్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజగోపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T05:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising