ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి అంగన్‌వాడీలు

ABN, First Publish Date - 2021-12-08T06:34:47+05:30

జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతు న్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉన్న భవనాల కు తరలించేందుకు సంబంధిత శాఖా ధికారులు కసరత్తు చేస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో మరో 17 కేంద్రాల తరలింపు 

- ప్రభుత్వానికి ఆదా కానున్న అద్దె సొమ్ము 

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతు న్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉన్న భవనాల కు తరలించేందుకు సంబంధిత శాఖా ధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి కే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో 172 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తుండగా, మరో 17 కేంద్రాలను ఈ నెలలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వ పాఠశా లల ఆవరణల్లోనే అంగన్‌వాడీ కేంద్రాల ను నిర్వహిస్తే చిన్నారులు త్వరగా పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి కనబ రుస్తారని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇదివరకే జరగగా, ఇంకా ఏమైనా కేంద్రాలు ఉంటే ఆ కేంద్రాలను పాఠశాలలకు తరలించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 701 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు 5 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 221 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 313 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 172 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కొనసాగుతున్నాయి. 313 కేంద్రాల్లో 17 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని నిర్ణయించామని జిల్లా సంక్షేమ శాఖాధికారి ఎండీ రవూఫ్‌ ఖాన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లోకి తరలించడం వల్ల రెండు విధాలా ప్రయోజనాలు కలగనున్నాయని చెబుతున్నారు. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల వరకు వయసు గల చిన్నారులకు ఆట, పాటలతో విద్యాబుద్దులు నేర్పించి పౌష్టికాహారాన్ని అందించడమే అంగన్‌వాడీల లక్ష్యం. ఐదేళ్లు దాటిన తర్వాత నేరుగా పాఠశాలలకు వెళ్లేందుకు పిల్లల్లో మరింత ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసే కేంద్రాలు ఉపయోగపడనున్నాయి. అలాగే పట్టణాల్లో నెలకు 4 వేల రూపాయల అద్దె, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు వెయ్యి రూపాయల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్నది. అద్దె భవనాల్లోని కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లోకి మార్పిడి చేయడం వల్ల ప్రభుత్వానికి కొంతమేరకు అద్దె సొమ్ము ఆదా కానున్నది.

Updated Date - 2021-12-08T06:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising