ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లానీటి కోసం గొడవలో వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-01-17T05:52:36+05:30

ఇంటి ఎదుట ఉన్న పబ్లిక్‌ ట్యాప్‌ నీటి కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వృద్ధుడి ప్రాణాలు బలితీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడుగురిపై హత్య కేసు నమోదు

కరీంనగర్‌ క్రైం, జనవరి 16: ఇంటి ఎదుట ఉన్న పబ్లిక్‌ ట్యాప్‌ నీటి కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వృద్ధుడి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటనలో పోలీసులు ఏడుగు రిపైహత్యకేసు నమోదు చేశారు. నగునూర్‌కు చెందిన అమిరిశెట్టి రాములు(60) కొడుకు రాజు శనివారం ఉదయం తమ ఇంటివద్ద రోడ్డుపై ఉన్న పబ్లిక్‌ట్యాప్‌కు పైపు తొడిగి ఇంట్లోకి నీటినితరలిస్తున్నాడు. కొద్దిసేపటికి రాములు ఇంటి ఎదురుగా ఉన్న అబ్దుల్‌ హమీద్‌ ఆపైపును తొలగించాడు. దీంతో రాములు కుటుం బసభ్యులు, అబ్దుల్‌హమీద్‌కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో రాములు, అతని కొడుకు రాజును అబ్దుల్‌హమీద్‌, అతని కుటుంబ సభ్యులు కొట్టారు. దీంతో రాములు కిందపడి అప స్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. హమీ ద్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు రాములును కడుపులో తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయాడని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కొడుకు విద్యాసాగర్‌ కరీంనగర్‌రూరల్‌ పోలీసు లకు ఫిర్యాదుచేశాడు. అబ్దుల్‌హమీద్‌, హఫీజ్‌, షంషద్‌, గుమ్రాన్‌, రియాజ్‌, ఎండీ ఫరూఖ్‌, ఎండీ ఏలియాస్‌లపై హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌రూరల్‌ సీఐతుల శ్రీనివా సరావు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాములు కుటుంబసభ్యులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో ప్రభుత్వాస్పత్రికి చేరుకోగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలాన్ని రూరల్‌ ఏసీపీ జే విజయసారధి పరిశీలించారు.

Updated Date - 2021-01-17T05:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising