ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లంతకుంట ఘటనపై విచారణ చేపట్టాలి

ABN, First Publish Date - 2021-04-21T06:26:04+05:30

ఇల్లం తకుంట మండలకేంద్రంలో మంత్రి కేటీ ఆర్‌ పర్యటన సందర్భంగా జరిగిన సం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచా రణ చేపట్టాలని, దాడులు చేసిన టీఆర్‌ ఎస్‌ నాయకులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సిరిసిల్లలో మాట్లాడుతున్న ప్రతాపరామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 20 : ఇల్లం తకుంట మండలకేంద్రంలో మంత్రి కేటీ ఆర్‌ పర్యటన సందర్భంగా జరిగిన సం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచా రణ  చేపట్టాలని, దాడులు చేసిన టీఆర్‌ ఎస్‌ నాయకులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సిరి సిల్ల పట్టణంలోని వాసవి కల్యాణ మం డపంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయా లని, నిరుద్యోగులకు భృతి  చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతి ప్రతం అందించేందుకు ప్రయత్నించగా పోలీసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. మంత్రి కేటీఆర్‌ సార థ్యం వహిస్తున్న జిల్లాలో ఫ్యాక్సనిజాన్ని తలపిం చేలా టీఆర్‌ఎస్‌ దాడులు కొనసాగుతున్నా యన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు  నియెజకవర్గాల్లో పోలీసులు లేకుండా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రైతువేదిక నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయన్నారు. కరోనా కేసు లు  పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉన్నా పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలిపారు.  సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమ్మరి శంకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంత్‌రావు, జిల్లా ప్రధాన కార్య దర్శులు రెడ్డబోయిన గోపి, రేగుల మల్లికార్జున్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, కైలాస్‌, పులి రాఖేష్‌, మల్లడపేట భాస్కర్‌, బర్కం నవీన్‌యాదవ్‌,  రాజు, నాగుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising