ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని యూనియన్లను చర్చలకు అనుమతించండి

ABN, First Publish Date - 2021-10-28T05:59:59+05:30

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు సంస్థలో జాతీయ కార్మిక సంఘాలన్నింటిని చర్చలకు ఆహ్వానించాలని రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ వీటీ థామస్‌ సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌కు సూచిం చారు.

ఆర్‌ఎల్‌సీతో చర్చిస్తున్న జాతీయ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఆర్‌ఎల్‌సీ సూచన

గోదావరిఖని, అక్టోబరు 27: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు సంస్థలో జాతీయ కార్మిక సంఘాలన్నింటిని చర్చలకు ఆహ్వానించాలని రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ వీటీ థామస్‌ సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌కు సూచిం చారు. బుధవారం సింగరేణి జాతీయ సంఘాల నాయకులు సీతారామయ్య, రియాజ్‌ అహ్మద్‌, జనక్‌ప్రసాద్‌, మంద నర్సింహారావులు ఆర్‌ఎల్‌సీని కలిశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి రెండేళ్ళు దాటినా ఎన్నిక లు నిర్వహిచలేదని, టీబీజీకేఎస్‌కు గుర్తింపు సంఘంగా అధికారిక కార్యక్రమా లు, ఆహ్వానించడం, చర్చలు జరపడం జరుగుతున్నట్టు ఆర్‌ఎల్‌సీకి తెలిపారు. కార్మిక సమస్యలు, రక్షణ విషయాల్లో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్టు నాయకులు వివరించారు. ఎన్నిక లు జరిగే వరకు అన్ని కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని జాతీయ సంఘాల నాయకులు ఆర్‌ఎల్‌సీని కోరారు. స్పందించిన ఆర్‌ఎల్‌సీ థామస్‌ సీఎండీ శ్రీధర్‌కు లేఖ పంపారు. 

Updated Date - 2021-10-28T05:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising