ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి

ABN, First Publish Date - 2021-05-09T05:18:40+05:30

కేసులు పెరుగుతున్న దృష్ట్యా పర్సనల్‌, మెడికల్‌ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సింగరేణి డైరెక్టర్‌(పీపీ, ఫైనాన్స్‌) బలరాంనాయక్‌, జీఎం(పర్సనల్‌) ఆనందరావు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆర్‌జీ-1 అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన డైరెక్టర్‌

గోదావరిఖని, మే 8: కేసులు పెరుగుతున్న దృష్ట్యా పర్సనల్‌, మెడికల్‌ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సింగరేణి డైరెక్టర్‌(పీపీ, ఫైనాన్స్‌) బలరాంనాయక్‌, జీఎం(పర్సనల్‌) ఆనందరావు సూచించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆర్‌జీ-1 పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా రెండో దశ విజృంభిస్తూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏరియా హాస్పిటల్‌లో కరోనా రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గనులు, డిపార్ట్‌మెంట్లపై ఆయా గనుల సంక్షేమాధికారులతో సమీక్ష చేయాలని, నివారణ కోసం అం దరూ తప్పకుండా మాస్క్‌లు ధరించి, భౌతికం దూరం పాటించాలని, కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేయించాలని, హ్యాండ్‌ వాష్‌లు, థర్మ ల్‌ స్కానర్స్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో డీజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, పర్సనల్‌ మేనేర్‌  సలీం, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సారంగపాణి, హెల్త్‌ ఆఫీ సర్‌ డాక్టర్‌ పద్మ,శ్రావణ్‌, శ్రీనివాస్‌, చక్రవర్తి,హనుమంతరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising