ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

ABN, First Publish Date - 2021-03-05T06:06:31+05:30

వేములవాడలో ఈ నెల 10 తేదీ నుంచి 12 వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న మేనేజర్‌ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మహాశివరాత్రి జాతరకు 793 ప్రత్యేక బస్సులు

- 14 ఉచిత మినీ బస్సులు 

-  కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌

వేములవాడ టౌన్‌, మార్చి 4 : వేములవాడలో ఈ నెల 10 తేదీ నుంచి 12 వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. వేములవాడ మున్సిపల్‌ పరిధి లోని తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్యాల యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  జాతర సందర్భంగా  793 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు   చెప్పారు. పట్టణంలోని కట్టకింద ప్రాంతంలో తాత్కాలిక బస్టాండ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆ ప్రాంతంలో జగిత్యాల రీజనల్‌ మేనేజర్‌ సత్యనారాయణ విధు ల నిర్వహిస్తారని,  భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా సూచనలు ఇస్తారని పేర్కొన్నారు.  తిప్పా పూర్‌ బస్టాండ్‌ నుంచి వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నర్సంపేట, కామారెడ్డి డిపోలకు   వెళ్లే బస్సులు నడుస్తాయని, జగిత్యాల, కొండగట్టు, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిర్మల్‌కు వెళ్లే బస్సులు కట్టకింద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ నుంచి  వెళ్తాయని తెలిపారు.   తిప్పాపూర్‌ బస్టాం డ్‌ నుంచి రాజన్న గుడి వరకు 14 ఉచిత మినీ  బస్సులను నడిపంచనున్నట్లు చెప్పారు. జగిత్యాల రీజనల్‌ మేనేజర్‌ సత్య నారాయణ, వేములవాడ డిపో మేనేజర్‌ భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-03-05T06:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising