ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పల్లెప్రగతి’ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-07-28T05:43:32+05:30

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మండల అధికారులను హెచ్చరించారు. మంగళవారం వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీర్నపల్లి, జూలై 27:   పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే   చర్యలు తప్పవని  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మండల అధికారులను హెచ్చరించారు. మంగళవారం వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో  పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని మద్దిమల్ల తండా, మద్దిమల్ల, బాబాయ్‌చెరువుతండా, కంచర్ల, బావుసింగ్‌నాయక్‌ తండాల్లో  చేపట్టిన శ్మశాన వాటిక నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌, కంపోస్టు షెడ్ల నిర్మాణం, బయోఫెన్సింగ్‌  ఏర్పాటు  పనులను పర్యవేక్షించారు.జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, డీపీఆర్‌ఈ శ్రీనివాస్‌రావు, డీఈఈ చంద్రశేఖర్‌, ఎంపీడీవో భారతి, ఎంపీవో నరేశ్‌, ఏపీవో శ్రీహరి,  సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టిసారించాలి 

బోయినపల్లి:పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అధికా రులకు సూచించారు. బోయినపల్లి మండలంలోని తడ గొండ, అనంతపల్లి గ్రామాల్లో మంగళవారం డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌తో కలసి శ్మశాన వాటికలు, కంపోస్టు షెడ్‌లు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.  శ్మశాన వాటికల వద్ద మొ క్కలు నాటడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్తను సేకరిస్తున్న ట్రాక్టర్‌ను పరిశీలించి తడి,పొడి చెత్తను వెర్వేరుగా సేకరిం చడం లేదా? అని పారిశుధ్య కార్మికులను ప్రశ్నించారు. మొక్కల పంపిణీలో ఫోర్జరీ సంత కాలు చేసారా? అని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ఎంపీవో గంగతిలక్‌, సర్పంచులు గుంటి లతాశ్రీ, చిందం రమేష్‌, వంగపల్లి సత్య, నారాయణరెడ్డి, ఏపీవో, కార్యదర్శులు రాజ, సులోచన, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 


తడగొండ గ్రామ కార్యదర్శి సస్పెన్షన్‌ 

మండలంలోని  తడగొండ గ్రామ కార్యదర్శి అనిల్‌ను సస్పెండ్‌, సర్పంచ్‌ రమేష్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తూ కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ ఉత్తర్వలు జారీ చేశారు.  మంగళవారం చేపట్టిన ఆకస్మిక పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌  సత్యప్రసాద్‌ అభివృద్ధి పనుల్లో లోపాలను గుర్తిం చారు.  కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌కు నివేదించగా కలెక్టర్‌ చర్య తీసుకున్నారు. 

Updated Date - 2021-07-28T05:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising