ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 కేజీల గంజాయి దహనం

ABN, First Publish Date - 2021-10-26T06:11:05+05:30

మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ సమారు 200 కేజీల గంజాయిని సోమవారం చీకురాయి చెరువు వద్ద పోలీసులు దహనం చేశారు.

గంజాయిని దహనం చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- గంజాయి నివారణకు సహరించాలన్న డీఎస్పీ

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 25: మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ సమారు 200 కేజీల గంజాయిని సోమవారం చీకురాయి చెరువు వద్ద పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్‌ మాట్లాడుతూ గంజాయి విక్రయించే, సేవించే వారి సమాచారం తెలిస్తే 100 నంబర్‌కు డయల్‌ చేసి  సమాచారం ఇవ్వాలని, ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటికే గంజాయి రవాణపై పోలీసులకు పూర్తి సమాచారం ఉందన్నారు. కొందరిని అదుపులోకి తీసుకొని పీడీయాక్ట్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. రేల్వై స్టేషన్‌, బస్టాండ్‌, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. యువలను గంజాయి బానిసలుగా మార్చే ఈ వ్యాపారానికి పూర్తి స్థాయిలో చెక్‌ పెడుతామ న్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలపై ప్రవర్తన శైలిపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి వ్యాపారంలో పట్టు బడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసే గంజాయి మహమ్మారిని తరిమి కొట్టేందుకు  స్థానిక ప్రజలు సహకారం అందిచాలని కోరారు.  కార్యక్రమంలో ఏసీపీలు సాదుల సారంగపాణి, గిరి ప్రసాద్‌, సీఐలు ప్రదీప్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేష్‌, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-10-26T06:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising