ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోజూ 1,575 రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు

ABN, First Publish Date - 2021-05-17T06:04:54+05:30

జిల్లాలో కొవిడ్‌ బారినపడి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రతి రోజు 1,575 రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు కేటాయించాలని తాను చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం వాటిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, మే 16: జిల్లాలో కొవిడ్‌ బారినపడి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రతి రోజు 1,575 రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు కేటాయించాలని తాను చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం వాటిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. జిల్లాలో మంత్రి నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచించిన మేరకు రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లను ఇవ్వాలని తాను కోరినట్లు తెలిపారు. దీనితో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇంజక్షన్ల కొరత ఉండదని అన్నారు. జిల్లాలోని 62 ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులకు సోమవారం నుంచి రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇంజక్షన్ల కొరత లేదని, వదంతులు, పుకార్లను నమ్మవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇంజక్షన్ల కొరత ఏర్పడితే వెంటనే టాస్క్‌ఫోర్సు కమిటీ దృష్టికి లేదా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. 


Updated Date - 2021-05-17T06:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising