ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాషాపండితులకు న్యాయం: ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2021-06-20T10:15:48+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా జీవో 2, 3, 9, 10లు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా జీవో 2, 3, 9, 10లు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని పండిత, పీఈటీ ఐక్యవేదిక ప్రతినిధులు మహ్మద్‌ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాస్‌, కాంతికృష్ణ, గౌరీ శంకర్‌ రావు శనివారం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కల్పించి ఎస్జీటీలకు కూడా న్యాయం చేస్తామని, న్యాయపరమైన చిక్కులు తొలగింపజేసి పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత తెలిపారు. గౌ రవ వేతనాన్ని పెంచినందుకు వేములవాడ ని యోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తె లంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసారు. వారు పలు సమస్యలను ప్ర స్తావించగా, మంత్రి పువ్వాడ అజయ్‌ దృష్టికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చారు.

Updated Date - 2021-06-20T10:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising