Jurala project: 12 గేట్ల ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-18T12:25:07+05:30
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 83 వేల
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 83 వేల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్‌ఫ్లో 86,673 క్యూసెక్కులు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 318.420 మీటర్లు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 9.459 టీఎంసీలుగా ఉంది.
Updated Date - 2021-07-18T12:25:07+05:30 IST