జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2021-03-21T17:08:08+05:30
3,181 మంది ఓటర్లు కాగా, పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీలో...
హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో జేహెచ్‌డబ్ల్యూఎస్ ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 మంది అభ్యర్థులు గెలుపొందారు. పోలింగ్, కౌంటింగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. జేహెచ్‌డబ్ల్యూఎస్ ప్యానల్, వ్యాపారవేత్త టి.హనుమంతరావు, రవీంద్రనాథ్ ప్యానెళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే జేహెచ్‌డబ్ల్యూఎస్ ప్యానల్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
కాగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో మొత్తం 1,757 ఓట్లు పోలయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, సినీ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్, జేసీ పవన్ రెడ్డి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు సినీ నటుడు శ్రీకాంత్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ, నిర్మాత దిల్ రాజు, కేఎస్ రామారావు, కేంద్ర మాజీమంత్రి పళ్ళం రాజు, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పీవీ మనమడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ తదితరులు ఓటింగ్ వినియోగించుకున్నారు.
జేడీ శీలం భార్య సుజాతతో పాటు మరో ఇద్దరు విజయం (10.30 pm)
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కేంద్రమాజీ మంత్రి జేడీ శీలం భార్య సుజాత గెలుపొందారు. జెహెచ్‌డబ్ల్యూఎస్ ప్యానల్ నుంచి పోటీ చేసిన శీలం సుజాతతో పాటు అదాల హిమబిందు రెడ్డి, డి. సునీల రెడ్డి కూడా విజయం సాధించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇంకా 13 మంది భవితవ్యం తేలాల్సి ఉంది
జేడీ శీలం భార్య ముందంజ (6.30 PM)
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం సతీమణి సుజాత శీలం మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. జెహెచ్‌డబ్ల్యూఎస్ ప్యానల్ నుంచి సుజాత శీలం పోటీ చేశారు.
పోలైన ఓట్లు 1757... (3:11 PM)
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఓట్లు 3,181 కాగా.. 1757 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ముగిసిన పోలింగ్.. (2:13 PM)
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం ఓట్లు 3,181కాగా, పోలైనవి 1750 ఓట్లుగా చెబుతున్నారు. సాయంత్రం 4గంలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పోటీలో వ్యాపారవేత్త టి.హనుమంతరావు, రవీంద్రనాథ్ ప్యానెల్ ఉన్నాయి. పాలకమండలిలోని 15 పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కాసేపట్లో ముగియనున్న పోలింగ్ (1:25 PM)
మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 2గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఉంది. ఓటేయని వారికి పోటీలో ఉన్న అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు 1610 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన సినీ హీరో వెంకటేశ్(1:17 PM)
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, సినీ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్, జేసీ పవన్ రెడ్డి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తదితరులు తాజాగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 8గంలకు పోలింగ్ ప్రారంభమవగా.. ఇప్పటివరకు 1400 ఓట్లు పోలయ్యాయి. మెత్తం ఓట్లు 3,181కాగా, మధ్యహాన్నం 2గంటలకు పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 4గంలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 759 ఓట్లు...
సినీ నటుడు శ్రీకాంత్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ, నిర్మాత దిల్ రాజు, కేఎస్ రామారావు, కేంద్ర మాజీమంత్రి పళ్ళం రాజు, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పీవీ మనమడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ తదితరులు ఓటింగ్ వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి ఈసారి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రారంభం అయి మూడు గంటలు అవుతుండగా.. ఇప్పటివరకు 759 ఓట్లు పోలయ్యాయి.
Updated Date - 2021-03-21T17:08:08+05:30 IST