ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయపెడుతున్న జోకర్ సాఫ్ట్‌వేర్

ABN, First Publish Date - 2021-06-16T23:17:45+05:30

జోకర్ సాఫ్ట్‌వేర్ భయపెడుతోంది. జోకర్ సాఫ్ట్‌వేర్‌తో యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జోకర్ సాఫ్ట్‌వేర్ భయపెడుతోంది. జోకర్ సాఫ్ట్‌వేర్‌తో యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసింది. మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్‌వేర్  ఇప్పటికే కుదిపేస్తోంది. ఫోన్లు, డెస్క్‌టాప్‌లో ప్రత్యక్షమవుతోంది. జోకర్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి వ్యక్తిగత సమాచారం వెళ్తుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. బ్యాంకు డిటైల్స్‌ నుంచి వ్యక్తిగత ఫొటోల వరకు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని ఆయన చెబుతున్నారు. జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని అంజనీకుమార్ సూచించారు.


సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతాలో సొమ్మును ఎత్తుకుపోతున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. మన వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తున్నారు.

Updated Date - 2021-06-16T23:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising