జంపన్నవాగులో ఇద్దరు గల్లంతు
ABN, First Publish Date - 2021-07-14T02:24:46+05:30
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరంగల్ రూరల్ జిల్లా గురజాల వద్ద వాగు దాటుతూ
మేడారం: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరంగల్ రూరల్ జిల్లా గురజాల వద్ద వాగు దాటుతూ అనిల్ అనేవ్యక్తి వాగులో గల్లంతు కాగా.. తాజాగా ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు మేడారం జంపన్నవాగులో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శ్యామల్‌రావు, కోటేశ్వరరావు గుర్తించారు. గల్లంతైన వారికోసం నిన్నటి నుండి నిర్విరామంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఆచూకీ లభించలేదు.. వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, మళ్లీ వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
Updated Date - 2021-07-14T02:24:46+05:30 IST