ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులు ఢిల్లీ టూర్ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారు: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-12-20T22:23:08+05:30

తెలంగాణ వచ్చాక ఇక ఉద్యమాల అవసరం ఉండదు అనుకున్నాం కాని స్వయం పాలనలో రైతులు రోడ్ల మీద, కేసీఆర్ ఏసీ గదుల్లో నిద్రపోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక ఇక ఉద్యమాల అవసరం ఉండదనుకున్నాం కాని స్వయం పాలనలో రైతులు రోడ్ల మీద, కేసీఆర్ ఏసీ గదుల్లో నిద్రపోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు వడ్ల కొనుగోలు సమస్య లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాక వడ్ల సమస్య సృష్టించిదన్నారు.ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని మండిపడ్డారు. ఈరోజు ధర్నాల పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు.  సమస్యను పరిష్కరించాల్సిన వాళ్లే ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులతో ఆడు కుంటున్నాయన్నారు.  మంత్రులు ఢిల్లీ పర్యటన పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. రైతులు, యువకులు, ప్రజలు కాంగ్రెస్ వైపు చూడకుండా టీఆర్ఎస్, బీజేపీ పన్నిన కుట్ర ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ బ్యాక్ డోర్ నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాజకీయంగా బతకడానికి డ్రామాలు రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు.  సీఎం ఢిల్లీకి వెళ్తేనే లేని ఉప యోగం మంత్రులు వెళ్తే ఉంటుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-20T22:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising