ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్, హరీష్‌రావుకి బహుశా రాత్రి నిద్ర పట్టకపోయుండొచ్చు: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-11-23T19:35:40+05:30

వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్‌గా, జిల్లా కలెక్టర్‌గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు, జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్ : వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్‌గా, జిల్లా కలెక్టర్‌గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు, జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ పైసలు వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్నాయి కనుకే ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. వెంకట్రామిరెడ్డి ఏమీ పాలు అమ్మి, కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించలేదన్నారు. అవి మన మెదక్ జిల్లా డబ్బులేనన్నారు. అక్కడ తీసుకుని.. ఇక్కడ ఓటు వేయాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో వెంకట్రామిరెడ్డి సంగతి చూస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి నిర్మలా బరిలో ఉండేసరికి సీఎం కేసీఆర్, హరీష్ రావుకి బహుశా రాత్రి నిద్ర పట్టకపోయుండవచ్చన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉంటే మంత్రి హరీష్ రావు మాట్లాడి డ్రాప్ చేయిస్తున్నారని.. కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డి కావడంతో డ్రాప్ చేయించలేరన్నారు. కాంగ్రెస్ బలం 230 ఓట్లని.. గెలవడానికి కావాల్సిన మిగితా ఓట్లు ఎలా రాబట్టుకోవాలనే ఆలోచన చేయాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T19:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising