ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదు: పోసాని

ABN, First Publish Date - 2021-03-08T01:31:41+05:30

తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల పార్టీపై రాజకీయ పక్షాలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల పార్టీపై రాజకీయ పక్షాలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ మొదలుకొని పలువురు షర్మిల పార్టీపై స్పందిస్తున్నారు. అయితే మెజార్టీగా చూస్తే షర్మిల పార్టీని స్వాగతించే వారి సంఖ్య స్వల్పంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఆమె రాణించలేరని పలువురు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చాయని, అందువల్లే ఆమె స్వంత పార్టీని పెడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్, షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని చెప్పారు. చేసి ఉంటే.. ఎపీలోనే షర్మిల పోటీకి వచ్చే వారు కదా అని ప్రశ్నించారు. షర్మిల ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని, అయితే తప్పేంటి అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.

Updated Date - 2021-03-08T01:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising