ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-10-22T05:13:08+05:30

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 21: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25నుంచి ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరం పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ బి.గోపి అన్నారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియేట్‌ పరీక్షల ప్రారంభంపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈమేర కు జిల్లాకు చెందిన ఏర్పాట్లపై కలెక్టర్‌ మంత్రికి వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 5,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతార న్నారు. వైద్యశాఖ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శానిటై జేషన్‌ థర్మామీటర్‌తో టెస్టులు నిర్వహించేందుకు తగిన వస తులు కల్పిస్తామన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖను ఆదేశించినట్లు తెలిపారు. ఇన్వి జిలేటర్‌ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి తగుచర్యలు తీసుకుంటారన్నారు. పరీక్ష సమయంలో ప్రైవే టు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని, గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థు లను అనుమతిస్తామని రెవెన్యూ శాఖకు 144సెక్షన్‌ గురించి తెలపడం జరిగిందన్నారు. సమావేశంలో డీఐఈవో కాక మాధవరావు, జితేందర్‌రెడ్డి, ఆర్టీసీ అధికారి శ్రీదేవి, డీఈవో వాసంతి, పోలీసు శాఖ నుంచి చంద్రశేఖర్‌, డీపీవో, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T05:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising