ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

ABN, First Publish Date - 2021-10-22T05:06:30+05:30

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  హనుమకొండ రూరల్‌, అక్టోబరు 21: ఇంటర్‌ ప్రథమ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ నుంచి ఇంటర్‌ ప్రథమ వార్షిక పరీక్షలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఇంటర్‌ ప్రథమ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో టేబుల్స్‌, సామగ్రితో సహా తప్పనిసరిగా శానిటైజ్‌ చేయించాలని ఆదేశించారు. వైద్య సిబ్బందితో కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 77 పరీక్ష కేంద్రాల్లో 19,762 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖాధికారి అజ్మీరా గోపాల్‌, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.లలితాదేవి, ఎగ్జామినేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising