ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్‌కు గాయాలు

ABN, First Publish Date - 2021-10-03T01:40:55+05:30

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థికి బలమూరు వెంకట్‌కు గాయాలయ్యాయి. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్‌కు గాయాలయ్యాయి. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి జంగ్ సైరన్ మోగించింది. విద్యార్థి జంగ్ సైరన్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాద్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల దాడిలో వెంకట్ గాయపడ్డారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు వెంకట్ వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఘర్షణలో బలమూరు వెంకట్ గాయపడ్డారు. వెంటనే నాగోల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే వెంకట్ గాయాలపాలైనారు. 


నేడు కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆ పార్టీ ఆందోళనలకు పిలుపునచ్చింది. విద్యార్థి సమస్యలపై 65 రోజులపాటు జంగ్ సైరన్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. డిసెంబర్ 9న రాహుల్ గాంధీసభతో ఈ కార్యక్రమం ముగియనుంది.

Updated Date - 2021-10-03T01:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising