ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు

ABN, First Publish Date - 2021-07-21T00:48:47+05:30

రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి 75,000 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. వ్యవసాయ భూముల కోసం ప్రస్తుతం ఉన్న విలువలను తక్కువ ధర ఉన్న దగ్గర 50శాతం, మధ్యరకంగా ఉన్న దగ్గర 40శాతానికి పెంచారు. అత్యధికంగా ఉన్న దగ్గర 30 శాతం ప్రభుత్వం పెంచింది. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటివరకు కనిష్ట విలువ.. చదరపు గజానికి 100 ఉండగా ప్రస్తుతం చదరపు గజానికి 200కి ప్రభుత్వం పెంచింది. ఓపెన్ ప్లాట్లు తక్కువ ధర ఉన్న దగ్గర 50 శాతం, మధ్యరకంగా ఉన్న భూములకు 40 శాతం.. అత్యధికంగా ఉన్న దగ్గర 30 శాతంగా సర్కార్ సవరించింది.


అపార్ట్‌మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న అతితక్కువ విలువ ఉన్న దగ్గర ఇప్పుడు ఎస్‌ఎఫ్టీకి రూ. 1000గా ప్రభుత్వం మార్చింది. తక్కువ విలువ ఉన్న దగ్గర 20 శాతం పెంచారు. ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30 శాతం పెంచారు. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు స్టాంప్ డ్యూటీ రేట్లను అమ్మకానికి 6 శాతం నుండి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన మార్కెట్ విలువలు, స్టాంప్ డ్యూటీ రేట్లు ఈనెల 22 నుండి అమలులోకి వస్తాయి.


Updated Date - 2021-07-21T00:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising