ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐనవోలు మల్లన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

ABN, First Publish Date - 2021-03-01T04:03:27+05:30

ఐనవోలు మల్లన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య


ఐనవోలు, ఫిబ్రవరి 16: ఐనవోలు మల్లికార్జునస్వామి వారాంతపు జాతరకు ఆదివారం భక్తులు వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు.  శనివారం సాయంత్రం నుంచే భక్తులు వచ్చి ఆలయ ప్రాంగణంలో విడిది చేయడంతో జాతర ప్రాంగణం భక్తులతో పోటెత్తింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తులు కనిపించారు. స్వామి వారికి ఉదయం మేలుకొలుపు తర్వాత  శైవాగమ పద్ధతిలో అర్చకులు విశేష అభిషేకాలు కల్యాణం నిర్వహించి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో నజర్‌, చెలక పట్నాలు వేసి బోనం వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  మొక్కుల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు భక్తులు ఒడి బియ్యం, వస్త్రాలు, ముతైదు సామగ్రిని ముట్టచెప్పారు. మరి కొందరు రథసేవను నిర్వహించారు. రథంలో ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆలయం చుట్టూ లాగుతూ ప్రదక్షిణలు చేశారు. ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. 


స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు

ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య కుటుంబసభ్యులు ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ సారయ్య కుటుంబసభ్యులు ఆలయ ముఖమండపంలో నజర్‌పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండోమెంట్‌ ఆర్‌జేసీ రామకృష్ణరావు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు.  శాలివాహన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో అన్నదానం  నిర్వహించారు.  



Updated Date - 2021-03-01T04:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising