ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డిలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ABN, First Publish Date - 2021-01-16T21:35:52+05:30

ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎం సంగీతకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎం సంగీతకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్‌ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని వైద్యులకు సంగీత చెప్పారు. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో  సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఏపీలోని విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్‌ వర్కర్‌ రాధ కళ్లు తిరిగాయి. అప్రమత్తమైన వైద్యులు  ఆమెకు చికిత్స అందించారు.


సంగారెడ్డి జిల్లాలో ఏఎన్‌ఎం నుంచి డాక్టర్‌ స్థాయి వరకు జిల్లా వ్యాప్తంగా పది వేల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. అయితే నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి విడత టీకాను కేవలం 780 మందికే ఇవ్వనున్నారు. వీరందరూ ఇదివరకే కొవిడ్‌ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వచ్చిన మెసేజ్‌ ఆధారంగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుంది. తొలివిడత డోస్‌ వేసుకున్న వారు రెండో డోస్‌ను సరిగ్గా 28 రోజులకు టీకా తీసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-01-16T21:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising