ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక శాఖలో అక్రమ పదోన్నతులు!

ABN, First Publish Date - 2021-08-27T09:31:26+05:30

సచివాలయంలోని ఆర్థిక శాఖలో సీనియారిటీ జాబితాలో ఎక్కడో కింది స్థానంలో ఉన్నవారిని పైకి తీసుకొచ్చి పదోన్నతులు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతన్నాయి. సామాజిక వర్గాల ఆధారంగా మిగతావారిని పక్కన పెడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. సీఎం అనుమతి లేకుండా కేడర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోస్టర్‌లో 20వ స్థానం అధికారిణికి అందలం..
  • త్వరలో డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి
  • కేసులున్నా.. పట్టించుకోకుండా ప్రమోషన్‌!
  • మజ్లిస్‌ నేత సిఫారసు.. వెంటనే నిర్ణయం
  • సీఎం అనుమతి లేకుండానే పోస్టు కన్వర్షన్‌


హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని ఆర్థిక శాఖలో సీనియారిటీ జాబితాలో ఎక్కడో కింది స్థానంలో ఉన్నవారిని పైకి తీసుకొచ్చి పదోన్నతులు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతన్నాయి. సామాజిక వర్గాల ఆధారంగా మిగతావారిని పక్కన పెడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. సీఎం అనుమతి లేకుండా కేడర్‌ పోస్టును నాన్‌-కేడర్‌ పోస్టుగా మార్చి.. మరొకరికి పదోన్నతి కల్పించారని, అవసరానికి మించి ఎక్కువ మందిని నియమించుకోవడంతో పదోన్నతుల సమయంలో ఇబ్బందికరంగా మారుతోందని  అంటున్నారు.


సామాజిక వర్గం అంశమే కీలకమా?

 ఏపీకి చెందిన ఓ మహిళా అధికారి కోర్టు కేసు ద్వారా తెలంగాణకు వచ్చారు. ఇక్కడి ఆర్థిక శాఖలోని అసిస్టెంట్‌ సెక్రటరీల రోస్టర్‌ జాబితాలో ఆమెది 20వ స్థానమైతే.. సర్వీసు నిబంధనల్లో సడలింపులిచ్చి ఒకటో స్థానానికి తెచ్చారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ నుంచి అంతర్గత ఉత్తర్వులు వెలువడ్డాయని వివరించారు. ఇటీవల డీపీసీ సమావేశం నిర్వహించి ఆమెకు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. త్వరలో ఆమె పదోన్నతి పొందనున్నారు. డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందిన ఆరు నెలల్లోనే.. ఆమె జాయింట్‌ సెక్రటరీగా పదోన్నతి పొందుతారని, ఆమేరకు ఉన్నతాధికారులు నియమ నిబంధనలు రూపొందించారని అంటున్నారు. ఆమెకు పదోన్నతి విషయంలో సామాజిక వర్గం అంశమే కీలకంగా మారిందన్న ఆరోపణలున్నాయి.


పైగా ఆమె ఎక్కడా మూడేళ్ల పాటు సర్వీసు చేసినట్లు రికార్డు లేదని, ఆమెపై కోర్టు కేసులు కూడా ఉన్నాయని మిగతా అధికారులు మండిపడుతున్నారు. మజ్లి్‌సకు చెందిన ఓ ముఖ్య నేత సిఫారసు చేస్తూ కవరింగ్‌ లెటర్‌ ఇవ్వడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఫైలును కదిపారన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును పిలిపించి, అనుకూలంగా ఫైలును తయారు చేయించారంటూ సచివాలయంలో చర్చించుకుంటున్నారు. సచివాలయ సంఘానికి చెందిన ఓ నాయకుడు, ఆర్థిక శాఖలోని ఓ కీలక అధికారి  దీనికి సహకరించినట్లు సమాచారం. 


ఎస్సీ మహిళా అధికారికి అన్యాయం!

ఆర్థిక శాఖలో రెండు జాయింట్‌ సెక్రటరీ పోస్టులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. వీటి కోసం ముగ్గురు డిప్యూటీ సెక్రటరీలు అర్హత కలిగి ఉన్నారు. ఒక డీఎస్‌.. సీఎం కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆయనకు ప్రమోషన్‌పై ఆసక్తి లేదని తెలిసింది. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మిగతా ఇద్దరు డీఎ్‌సలకు జాయింట్‌ సెక్రటరీలుగా పదోన్నతి లభించడం ఖాయం. అయితే ఒక పోస్టును ఏపీ అధికారిణితో భర్తీ చేయడానికి మార్గం సుగమం చేయడంతో ఈ ఇద్దరు డీఎస్‌ స్థాయి మహిళా అధికారుల్లో ఒకరికి అన్యాయం జరిగే అవకాశముంది.  


8 మంది పని చేయాల్సిన చోట 19 మంది

ఆర్థిక శాఖలో అవసరానికంటే ఎక్కువ మంది అసిస్టెంట్‌ సెక్రటరీలు పనిచేస్తుండడం విమర్శలకు  తావిస్తోంది. 8 మంది పని చేయాల్సిన చోట 19 మంది ఏఎస్‌లు ఉన్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. సచివాలయంలోని ఆర్థిక శాఖలో 30 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్రటరీ 3 లేదా 4 సెక్షన్లు చూస్తుంటారు. ఇదే పద్ధతి ఇతర శాఖల్లోనూ కొనసాగుతోంది. రెవెన్యూ రాబడుల శాఖల్లోని విభాగాధిపతుల కార్యాలయాల్లో (హెచ్‌ఓడీ)లో పని చేయడానికి ఆర్థిక శాఖ కొత్తగా 4 ఏఎస్‌ పోస్టులను సృష్టించింది.


వీరు కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌, రవాణా వంటి విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరిని సచివాలయంలోని ఆర్థిక శాఖలోనే పని చేయిస్తున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌, ఐటీ తదితర విభాగాల నుంచి సచివాలయ ఆర్థిక శాఖకు విధిగా వచ్చి పని చేయాల్సిన కొన్ని రకాల ఏఎస్‌ స్థాయి పోస్టులుంటాయి. ఇలాంటివన్నీ కలిపి మొత్తం 11 పోస్టులను ఆర్థిక శాఖలోనే కొనసాగిస్తున్నారు. ఈ  ఏఎస్‌ పోస్టులను సెక్షన్‌ ఆఫీసర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేసి, కొనసాగిస్తున్నారు. దీంతో  అంతగా పనిలేని చోట 19 మంది ఏఎ్‌సలను కొనసాగించడమెందుకని, అవసరమైన శాఖలకు పంపించవచ్చు కదా అని సచివాలయ వర్గాలు అంటున్నాయి.  


సీఎం దృష్టికి వెళ్లని కేడర్‌ పోస్టు కన్వర్షన్‌

సచివాలయ ఆర్థిక శాఖలో 3 అదనపు(అడిషనల్‌) సెక్రటరీ పోస్టులున్నాయి. వీటిలో ఒకటి కేడర్‌ పోస్టు

(తప్పనిసరిగా ఐఏఎస్‌ అధికారితో భర్తీ చేయాల్సిన పోస్టు), రెండు నాన్‌-కేడర్‌(నాన్‌ ఐఏఎస్‌) పోస్టులున్నాయి. కేడర్‌ పోస్టును ఇటీవల నాన్‌-కేడర్‌ పోస్టుగా కన్వర్షన్‌ చేశారు. జాయింట్‌ సెక్రటరీగా ఉన్న ఓ అధికారిణికి అదనపు సెక్రటరీగా ప్రమోషన్‌ ఇచ్చి దీనిని భర్తీ చేశారు. వాస్తవానికి కేడర్‌ పోస్టును నాన్‌-కేడర్‌ పోస్టుగా మార్చేటప్పుడు తప్పకుండా సీఎం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ కన్వర్షన్‌ ఫైలును సీఎంకు పంపకుండానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో కన్వర్షన్‌ చేసేశారని విమర్శిస్తున్నారు. 

Updated Date - 2021-08-27T09:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising