ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాం

ABN, First Publish Date - 2021-09-18T08:45:01+05:30

తమ కుటుంబా న్ని ప్రభుత్వం ఆదుకోకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు భార్య పల్లకొండ మౌనిక రోదిస్తూ చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా భర్తను పోలీసులే చంపారు: మౌనిక 

మోత్కూరు, సెప్టెంబరు 17: తమ కుటుంబా న్ని ప్రభుత్వం ఆదుకోకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు భార్య పల్లకొండ మౌనిక రోదిస్తూ చెప్పింది. రాజు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించి వచ్చిన అనంతరం శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో విలేకరులతో ఆమె మాట్లాడింది. ‘నా భర్త ఆ పని చేశాడో లేదో తెలియదు.


అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడని చెప్పి నా భర్తను పోలీసులు చంపారు. దీంతో నేనూ, నా బిడ్డ, మా అత్త అనాథలమయ్యాం’ అని బోరుమంది.  ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, అప్పుడు పోలీసులు ఇలానే వ్యవహరించారా? అని ఆమె ప్రశ్నించింది. తమ కుటుంబానికి మగదిక్కు లేకుండా పోయిందని.. తాను, 11 నెలల కుమార్తె, తన అత్త ఎలా బతకాలి అని వాపోయింది. తమకు ఉన్న ఇల్లు కూడా ధ్వంసం చేశారని, ఎక్కడ ఉండాలంటూ రోదించింది. బంధువుల ఇళ్లలో ఎన్నాళ్లు ఉంటామని ప్రశ్నించింది. తన భర్తను చంపి బాధిత కుటుంబానికి న్యాయం చేసినట్టుగా తమ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించింది.  

Updated Date - 2021-09-18T08:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising