ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే ఆదర్శం కేసీఆర్‌ పథకాలు: ఎమ్మెల్యే రాజయ్య

ABN, First Publish Date - 2021-09-08T18:00:18+05:30

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘునాథపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని 29 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని పొట్టిగుబ్బడి తండా గ్రామ పంచాయతీలో మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామంలో సీసీ రోడ్లు, సైడు కాలువలు, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు కోసం రూ.11 లక్షలు మంజూరు చేస్తానని, పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం చూపెడితే నిధులు కేటాయిస్తాననిఇ, అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.  అంతకు ముందు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు భూక్య శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పిల్లలకు ప్రభుత్వ హాస్టల్‌లలో చదువుకునేలా అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం అలుగు పోస్తున్న ఖిలాషాపూర్‌ పటేల్‌ చెరువును సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసి బొల్లం అజయ్‌మణికంఠ, సర్పంచ్‌ జేతురాం, దొనికెల రమాదేవి, మడ్లపల్లి సునీత, బుచ్చయ్య, భిక్షపతి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


రఘునాథపల్లి నుంచి పాలకుర్తికి బస్‌ సర్వీస్‌ ప్రారంభం

రఘునాథపల్లి: రఘునాథపల్లి బస్‌ స్టేషన్‌ నుంచి పాలకుర్తి వరకు వెళ్లే బస్‌ సర్వీ్‌సను మంగళవారం ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల సేవే లక్ష్యంగా అంకిత భావంతో పని చేస్తున్న ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోకల శివకుమార్‌, బస్‌స్టేషన్‌ కంట్రోలర్‌ కుర్ర సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-08T18:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising