ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఏఎస్‌ అధికారి 3 కార్ల దర్జా !

ABN, First Publish Date - 2021-07-08T08:31:10+05:30

ప్రభుత్వ అధికారులకు అధికారికంగా ఎన్ని కార్లు ఉంటా యి? సాదారణంగా అయితే ఒకే కారు ఉంటుంది. మరీ అవసరం ఉందనుకుంటే మరొక కారు ఉం డొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధుల్లో నిర్లక్ష్యం, ప్రజాధనం దుర్వినియోగం


హైదరాబాద్‌,జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులకు అధికారికంగా ఎన్ని కార్లు ఉంటా యి? సాదారణంగా అయితే ఒకే కారు ఉంటుంది. మరీ అవసరం ఉందనుకుంటే మరొక కారు ఉం డొచ్చు. కానీ రాష్ట్రానికి చెందిన ఆ ఐఏఎస్‌ అధికారిగారు మాత్రం ప్రభుత్వ కోటాలో ఏకంగా మూ డు కార్లను వాడేస్తున్నారు. ఆయన గారి ఈ దర్జా వ్యవహారం ఇప్పుడు ఐఏఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఓ కీలకమైన కమిషన్‌. ప్రస్తుతం దానికి చైర్మన్‌, సభ్యులు లేరు. కమిషన్‌ కార్యదర్శి హోదా లో ఓ ఐఏఎస్‌ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఒక కారు కేటాయించింది. దానిని వాడుకుంటున్నారు. కమిషన్‌ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉండటం తో, ఆయన వాడాల్సిన కారును కూడా కార్యదర్శి వాడేస్తున్నారు. ఈ రెండు కార్లు చాలదన్నట్లు, క మిషన్‌ తరఫున అద్దెకు తీసుకున్న మరో కారును కూడా ఆయనే వినియోగిస్తున్నారు. ఈ కారును తన స్వస్థలం.. పొరుగు రాష్ట్రంలోని ఇంటి వద్ద అ వసరాలకు వినియోగిస్తున్నారు. ఆ కారు అద్దె కిం ద ప్రభుత్వం ప్రతి నెలా రూ.60వేల చొప్పున చెల్లిస్తోంది. ఇలా మూడు కార్ల దర్జా ఒలకబోస్తున్న ఈ అధికారి, రోజూ కార్యాలయానికి వస్తున్నారా అంటే అదీ లేదని ఆయన కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆయన విధులకు ఎప్పుడు వస్తా రో తమకు కూడా తెలియదని చెబుతున్నారు. అయితే.. ఈ ఐఏఎస్‌ అధికారి నిర్వాకం ఇప్పటివరకు ఉన్నతాధికారుల దృష్టికి రాలేదని తెలుస్తోం ది. సాక్షాత్తూ ఒక ఐఏఎస్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2021-07-08T08:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising