ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితుడి మృతిపై చిన్నారి తండ్రి స్పందన..

ABN, First Publish Date - 2021-09-16T18:35:14+05:30

హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై  రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన బాధితురాలి తండ్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిందితుడు చనిపోయాడని పోలీసులు చెబితే తాము నమ్మమని, మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకురావాలని అన్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడింది అతనేనా? అనేది తాము గుర్తుపడతామని అన్నారు. బతికి ఉంటే చంపుతామనే భయంతో తీసుకురాకపోవచ్చు.. ఇప్పుడు ఎలాగూ చనిపోయాడు కాబట్టి ఆ బాడీని మా మందుకు తీసుకువాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడు అతనా కాదా అనేది చూస్తామన్నారు. ఆ వార్తపై తమకు అనుమానం ఉందని, పోలీసులపై నమ్మకం లేదని, మృత దేహాన్ని చూస్తేనే నమ్మకం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-16T18:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising