ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ : పోలీసులపై తిరగబడ్డ యువకుల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-05-27T13:31:35+05:30

లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో ఇమాద్‌నగర్‌లో బైక్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌ సర్కిల్‌ సులేమాన్‌నగర్‌ ఇమాద్‌నగర్‌లో లాక్‌డౌన్‌ సమయంలో బయట తిరగవద్దన్నందుకు పోలీసులను  దుర్బాషలాడటమే కాకుండా వారిపై దాడి చేసినంత పనిచేసిన అమీర్‌(21), సోహెల్‌(19)లను అరెస్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘన చేసినందుకు వారిపై 51-బి సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో ఇమాద్‌నగర్‌లో బైక్‌పై తిరుగుతున్న ఇద్దరు యువకులను బయటకు రావద్దని డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డగించారు. దాంతో వారు పోలీసులను నానా దుర్బాషలాడారు. రోడ్డుపై ఉన్న రాయిని తీసి కొట్టేంత పనిచేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు యువకులు అమీర్‌, సోహెల్‌లను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-05-27T13:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising