ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తితో ప్రేయసి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. కేవలం పదే పది నిమిషాల్లో..

ABN, First Publish Date - 2021-07-08T14:06:05+05:30

అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పబ్‌లు, పార్కులకు వెళ్లేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 100 డయల్‌కు ఫోన్‌.. పది నిమిషాల్లో పోలీసులు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో ప్రేయసి ఇంటికి వెళ్లాడు. గమనించిన ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతితో నాలుగు సంవత్సరాల క్రితం బోరబండ బంజారానగర్‌కు చెందిన బండారి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పబ్‌లు, పార్కులకు వెళ్లేవారు.


పెళ్లి విషయం వచ్చే సరికి గొడవలు మొదలయ్యాయి. దీంతో యువతి గతేడాది అక్టోబరులో మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బయటకు వచ్చిన తర్వావాత ఇద్దరూ రాజీ పడ్డారు. ఇదిలా ఉండగా ఈ నెల 6న రాత్రి సమయంలో యువతి తన సోదరితో కలిసి ఇంట్లో ఉంది. అదే సమయంలో శ్రీకాంత్‌ మద్యం తాగి యువతి ఇంటికి వచ్చాడు. ఆమెతో కొద్ది సేపు మాట్లాడాడు. ఇంతలో సోదరి శ్రీకాంత్‌ వెనుక భాగంలో జంబియాను చూసింది. వెంటనే అప్రమత్తమై డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌ను అరెస్టు చేసి ఆయుధాల సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-08T14:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising