ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీకు కాబోయే భార్య ఇంటి పక్కనే ఉంటా.. మీరంటే నాకిష్టమని..’

ABN, First Publish Date - 2021-05-27T13:29:30+05:30

‘నీకు కాబోయే భార్య ఇంటి పక్కన ఉంటానని, మీరంటే నాకు ఇష్టం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యువతి ప్రేమను అంగీకరించలేదని..
  • పెళ్లి చెడగొట్టాలని చూసి కటకటాల్లోకి.. 


హైదరాబాద్‌ సిటీ : ఆన్‌లైన్‌ పరిచయం అయిన యువతి తన ప్రేమను అంగీకరించలేదని.. ఆమె పెళ్లి చెడగొట్టాలని చూసిన యువకుడ్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాండూరుకు చెందిన వంగ శివకుమార్‌ అలియాస్‌ నాని రెస్టారెంట్‌ ఓనర్‌. అతనికి స్నాప్‌చాట్‌లో ఒక యువతి ప్రొఫైల్‌ కనిపించింది. ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆమె యాక్సెప్ట్‌ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి రోజు ఆన్‌లైన్‌లో చాటింగ్‌లు చేసుకునేవారు. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌లు ఇచ్చిపుచ్చుకొని ప్రతీరోజు మాట్లాడుకునేవారు. 


ఈ క్రమంలో ఇటీవల ఆ యువకుడు ఆమెను చూడ్డానికి హైదరాబాద్‌ వచ్చాడు. ఉప్పల్‌లో ఆమెను కలిశాడు. తమ స్నేహానికి గుర్తుగా ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత శివకుమార్‌ ఆమెకు ఫోన్‌ చేసి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. అందుకు ఆ యువతి తనకు ఇప్పటికే పెళ్లికుదిరిందని చెప్పింది. తనకు కాబోయే భర్త ఫొటోను, ఫోన్‌ నంబర్‌ను పంపింది. ఎలాగైనా ఆమె పెళ్లి చెడగొట్టాలని భావించిన యువకుడు ఆమెకు కాబోయే భర్తతో యువతిగా పరిచయం చేసుకున్నాడు.


వాట్సాప్‌ చాటింగ్‌లు చేసేవాడు. ‘నీకు కాబోయే భార్య ఇంటి పక్కన ఉంటానని, మీరంటే నాకు ఇష్టం’ అంటూ మెసేజ్‌లు పెట్టేవాడు. నీకు కాబోయే భార్యకు బోయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని, అతడితో ఆమె దిగిన ఫొటోలు నా వద్ద ఉన్నాయంటూ వాటిని షేర్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-05-27T13:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising