ఎల్లమ్మ ఆలయంలో తులాభారానికి విశేష స్పందన
ABN, First Publish Date - 2021-08-04T06:00:22+05:30
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన తులాభారానికి విశేష స్పందన లభిస్తోంది.
అమీర్‌పేట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన తులాభారానికి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ చేతుల మీదుగా ఈ తులాభారం ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు విశేష సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా ఎల్లమ్మ ఆలయం పాలకమండలి సభ్యులు కొండ్రజు సుబ్బరాజు, వెంకటరమణమ్మ దంపతులకు మంగళవారం ఆలయ ప్రాంగణంలోని తులాభారం మండపంలో భక్తుల సమక్షంలో తులాభారం జరిగింది. వారు 135 కేజీల బరువు తేలడంతో అంతమొత్తంలో బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునే విధంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కొత్తపల్లి సాయిబాబాగౌడ్, సభ్యులు బీఆర్ నారాయణరాజు, అశోక్‌యాదవ్, శ్రీనివా్‌సగుప్తా, పుట్టల శేఖర్, కట్టా బలరాం, హన్మంతరావు, లక్ష్మి, ఉమానాథ్‌గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-08-04T06:00:22+05:30 IST