ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court తీర్పు ఇచ్చినా ఈ పరిశ్రమలు తరలించలేదేం..!?

ABN, First Publish Date - 2021-11-08T16:06:02+05:30

హైకోర్టు తీర్పు ఇచ్చినా పరిశ్రమల నిర్వాహకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : జనావాసాల మధ్య ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా పరిశ్రమల నిర్వాహకులు ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తూ ఆగస్టులోగా పరిశ్రమల తరలించాలని ప్రభుత్వం ఆదేశించినా సదరు నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.


కాలుష్యాన్ని వెదజల్లుతున్న వంటనూనెల పరిశ్రమల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని బూచనెల్లిలో 200 ఎకరాలను, ఐరన్‌ ఓర్‌, స్టీల్‌ పరిశ్రమల కోసం వికారాబాద్‌ జిల్లా రాకంచర్లలో భూములు కేటాయించినా పరిశ్రమలను తరలించేందుకు నిర్వాహకులు ముందుకు రావడంలేదు. కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇవ్వడమే పనిగా భావించి తర్వాతి చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోంది. కఠిన చర్యలు లేకపోవడంతో.. పరిశ్రమల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పరిశ్రమల తరలింపు సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-11-08T16:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising