ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైర్‌పర్సన్‌ ఎవరో?

ABN, First Publish Date - 2021-05-05T13:16:47+05:30

నూతనంగా ఏర్పడిన కొత్తూర్‌ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. మున్సిపాలిటీలో 12వార్డులు ఉండగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపికపై కొత్తూరులో ఉత్కంఠ



హైదరాబాద్/కొత్తూర్‌: నూతనంగా ఏర్పడిన కొత్తూర్‌ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. మున్సిపాలిటీలో 12వార్డులు ఉండగా సోమవారం విడుదలైన ఫలితాల్లో ఏడుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో చైర్‌పర్సన్‌ పదవిని సాధించేందుకు కావాల్సిన స్థానాలను టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. ఆ పార్టీలో పదవికోసం పోటీ తీవ్రంగా నెలకొంది. కొత్తూరు గ్రామ పంచాయతీ స్థాయినుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మొదటి చైర్‌పర్సన్‌ పదవి ఎవరిని వరిస్తుందోనని కొత్తూరు వాసులతోపాటు రాజకీయవర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చైర్‌పర్సన్‌ పదవికోసం ప్రధానంగా ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది.


షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాతుక దేవేందర్‌ యాదవ్‌  తన భార్య బాతుక లావణ్యను 8వ వార్డునుంచి పోటీ చేయించారు. కొత్తూర్‌ మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా  పనిచేసిన జె. సుదర్శన్‌గౌడ్‌ మున్సిపల్‌ ఎన్నికల ముందు మంత్రులు కేటీఆర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చైర్మన్‌ పదవి ఆశించి 10వ వార్డులో తన భార్య జె. కరుణను టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ భార్యలను చైర్‌పర్సన్‌ పదవిలో కూర్చోబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఏడుగురు కౌన్సిలర్లు ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్టులో క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తుండడంలో చైర్‌పర్సన్‌ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ కొత్తూరు వాసుల్లో నెలకొంది.

Updated Date - 2021-05-05T13:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising