ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత

ABN, First Publish Date - 2021-03-05T12:10:21+05:30

సెల్‌ఫోన్‌లు పొగొట్టుకున్న బాధితులకు ఊరట కల్పిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దేశవ్యాప్తంగా వెతికిన పోలీసులు.. 


హైదరాబాద్‌ సిటీ : సెల్‌ఫోన్‌లు పొగొట్టుకున్న బాధితులకు ఊరట కల్పిస్తూ... ఏకంగా తప్పిపోయిన 58 సెల్‌ఫోన్లను అంబర్‌పేట్‌ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు వాటి అన్వేషణలో నిమగ్నమయ్యారు. అంబర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.మోహన్‌ కుమార్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ డి.బిక్షపతిలతో పాటు సిబ్బంది కలిసి సెల్‌ఫోన్‌లను సేకరించారు. రూ.9.5 లక్షలు విలువ చేసే మొత్తం 58 సెల్‌ఫోన్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేశారు.


కేవలం పోగొట్టుకున్న ఫోన్‌లు మాత్రమే ఉండటంతో.. ఇందులో నిందితుల ప్రమేయం లేదని పోలీసులు భావించారు. ఫోన్‌లకు సంబంధించిన బాధితులకు సమాచారం ఇవ్వగా వారిలో 10మంది గురువారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ 10మంది... పోగొట్టుకున్న తమ ఫోన్‌ను సీపీ చేతుల మీదుగా అందుకున్నారు. మిగతావారిని పోలీ‌స్‌స్టేషన్‌కు పిలిచి వారి ఫోన్‌లు అందజేస్తామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-03-05T12:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising