ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 28న ‘వైష్ణవ జనుడవు నీవే అయితే’ గీతావిష్కరణ

ABN, First Publish Date - 2021-02-24T21:48:16+05:30

మహాత్మా గాంధీ తన దినచర్యలో భాగంగా ఆలపించిన ‘వైష్ణవ జనతో’ ప్రార్ధనాగీతానికి తెలుగు అనువాదం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహాత్మా గాంధీ తన దినచర్యలో భాగంగా ఆలపించిన ‘వైష్ణవ జనతో’ ప్రార్ధనాగీతానికి తెలుగు అనువాదం సిద్ధమైంది. ఈ గీతాన్ని శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్ తెలుగులో రాసి విడుదల చేస్తున్నారు. 14వ శతాబ్దంలో నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాశారు. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. 


'ఆనంద్, గోదావరి, చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి... ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్రమందించారు. ఈనెల 28, ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గీతావిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలారామాన్ సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. ఎమ్.ఎల్.సి. రామచంద్రరావు, ప్రముఖ నటులు, మాజీ మంత్రి బాబుమోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు అలీ, బ్రిగేడియర్ వి.శ్రీనివాసరావు విశిష్ట అతిధులుగా పాల్గొంటున్నారు. దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాలనే సత్సంకల్పంతో ‘వైష్ణవ జనుడవు నీవే అయితే’ గీత రూపకల్పనకు నడుం కట్టామని డాక్టర్ కమల తెలిపారు.



Updated Date - 2021-02-24T21:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising