ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరిలోనూ తెలియని భయాలే..

ABN, First Publish Date - 2021-01-17T06:32:10+05:30

వారిద్దరు ఏళ్లుగా నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో కలసి పని చేస్తున్న వారే.

జయమ్మ, తేజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వారిద్దరు ఏళ్లుగా నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య   కేంద్రంలో కలసి పని చేస్తున్న వారే. ఒకరు నర్సు తేజా, మరొకరు ఏఎన్‌ఎం జయమ్మ, సాధారణ సమయాల్లో ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటారు. కానీ, శనివారం వారిద్దరి మధ్య బావోద్వేగాలు, ఒకింత భయాలు చోటు చేసుకున్నాయి. ఒకరి కళ్లలో మరొకరు చూసుకుంటూ కంటి భాషతో మాట్లాడుకున్నారు. కారణం ఈ కేంద్రంలో మొదటి వ్యాక్సిన్‌ ఇంజక్షన్‌ చేయాల్సింది నర్సు తేజా.. మొదటి టీకా తీసుకునేది ఏఎన్‌ఎం జయమ్మ. కొన్ని వేల ఇంజక్షన్లు చేసిన తేజా కాస్త భయంతో.. కాస్త వణుకుతున్న చేతులతో వాక్సినేషన్‌ చేశారు. తేజా కళ్లలోకి చూస్తూ జయమ్మ టీకా తీసుకున్నారు. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉన్నా.. వాక్సినేషన్‌ వేళ వారి మధ్య ప్రేమ, భయం, ఆందోళన కనిపించింది. వాక్సినేషన్‌ వేయించుకున్న రెండు గంటల తర్వాత ఆ ఇద్దరు ముఖాలు మరొకరు చూసుకుంటూ సంతోషంగా కలుసుకున్నారు. 


ప్రార్థన చేశా.. 

అడ్డగుట్ట, జనవరి 16, (ఆంధ్రజ్యోతి): ఆయన నాంపల్లిలోని ఇమామ్‌ మసీద్‌ హజ్‌ హౌస్‌లో ప్రార్థన చేస్తారు. గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌ టీకా వేస్తున్నారని, మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపు మేరకు శనివారం ఆసుపత్రికి వచ్చారు. టీకా వేసుకునే వారి ఆరోగ్యం బాగుండాలని,  భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని ఆసుపత్రిలో ప్రార్థన చేయడానికి వచ్చినట్లు మీడియాకు తెలిపారు. వాక్సినేషన్‌ తర్వాత ఆసుపత్రి ఆవరణలో కొద్దిసేపు ప్రార్థన చేసినట్లు తెలిపారు.  



ముందున్న వైద్యులు..

కరోనా వైరస్‌లో ముందుండి బాధితుల ప్రాణాలకు అడ్డు వేసిన వైద్యులు వ్యాక్సిన్‌ వేసుకోవడంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. కొన్ని చోట్ల ఆరోగ్య సిబ్బంది టీకా వేసుకునేందుకు భయపడుతుండగా, వైద్యులే మొదటి టీకాలు వేసుకొని  వారిలో ధైర్యం నింపారు. గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ డాక్టర్‌ రమేష్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, ఐపీఎం డైరెక్టర్‌, ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ మొదటి టీకాలు వేసుకున్నారు. మరో పదిమంది వైద్యులు టీకాలు వేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో మొదటి టీకా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తీసుకున్నారు. తర్వాత ఆర్‌ఎంఓ డాక్టర్‌ రఫీ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌ మొదటి టీకా తీసుకున్నారు. 



Updated Date - 2021-01-17T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising