ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపడుచు హేళన చేసిందని పసికందును చంపేసింది!

ABN, First Publish Date - 2021-06-20T18:24:09+05:30

‘నీకు థైరాయిడ్‌ ఉంది. పిల్లలు పుట్టరు’ అంటూ పలుమార్లు ఆడపడుచు హేళన చేయడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మేనత్తే హంతకురాలు
  • తనకు పిల్లలు పుట్టరని హేళన చేయడంతో కక్ష
  • పిల్లలు లేని బాధ తెలియాలనే ఈ పని
  • చెప్పిన నిందితురాలు  

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌ : ‘నీకు థైరాయిడ్‌ ఉంది. పిల్లలు పుట్టరు’ అంటూ పలుమార్లు ఆడపడుచు హేళన చేయడంతో.. పిల్లలు లేకుండా చేస్తే ఆ బాధ నీకూ తెలుస్తుందని పసికందును హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. ఆడపడుచుకు లేకలేక పుట్టిన బిడ్డను నీటి ట్యాంక్‌లో పడేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితురాలు అంగీకరించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో రెండు నెలల బాలుడి హత్య కేసులో నిందితురాలిని శనివారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ స్వామి కేసు వివరాలు వెల్లడించా రు. అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన మంచాల లత, నెర్రపల్లి గ్రా మానికి చెందిన దూసరి తిరుమలే్‌షలకు 12 ఏళ్ల తర్వాత  రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. అప్పటి నుంచి లత అనాజ్‌పూర్‌లోని తల్లిగారి ఇంట్లో ఉంటోంది. లత తమ్ముడు బాల్‌రాజ్‌కు రెండున్నర సంవత్సరాల క్రితం శ్వేతతో పెళ్లి జరిగింది. శ్వేతకు థైరాయిడ్‌ సమస్య ఉండటంతో రెండు నెలల క్రితం అబార్షన్‌ జరిగింది.


ఈ క్రమంలో లత పలుమార్లు శ్వేతను అవమానపరుస్తూ మాట్లాడింది. తీవ్ర మనస్తా పానికి గురైన శ్వేత లతపై కక్ష పెంచుకుంది. ఏలాగైనా లతకు పిల్లలు లేకుండా చేసి, ఆ బాధను తెలియజేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తోంది. శుక్రవారం రాత్రి ఇంట్లో మామ రంగయ్య, అత్త పద్మ, ఆడపడుచు లత, బాలుడు ఉమామహేశ్వర్‌ ఒక చోట పడుకున్నారు. బాల్‌రాజ్‌, శ్వేత మరో గదిలో పడుకున్నారు. శ్వేత శుక్రవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో నిద్రలేచి లత పక్కనే పడుకున్న రెండు నెలల ఉమామహేశ్వర్‌ను తీసుకుని ఇంటిపైకి వెళ్లింది.


 బాలుడి ముక్కు, ఛాతీపై నొక్కి చంపేసే ప్రయ త్నం చేసింది. బాలుడు ఏడవడంతో అక్కడే ఉన్న నీటి ట్యాంక్‌(సింటెక్స్‌ ట్యాంక్‌)లో ముంచేసింది. కొద్ది సేపు అక్కడే ఉండి బాలుడు చనిపోయాడని నిర్ధారించుకుని, తర్వాత వచ్చి పడుకుంది. తల్లి లేచి చూడగా, బాలుడు కనిపించలేదు. చివరికి నీటి ట్యాంక్‌లో శవమై కనిపించాడు. పోలీసులు విచారణ చేపట్టగా, ఇంట్లోకి కొత్తవారెవరూ రాకపోవడంతో కుటుంబసభ్యులను విచారించారు. శ్వేతను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసి నట్లు అంగీకరించిందని  ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. నిందితురాలు శ్వేతను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వీరభద్రం పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T18:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising