ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trial Room లో సెల్‌ఫోన్‌ కెమెరా.. యువతి దుస్తులు మార్చుకుంటుండగా వీడియో.. ఆమె గమనించడంతో..!

ABN, First Publish Date - 2021-11-06T16:08:43+05:30

ఓ వస్త్ర దుకాణంలో యువతులు దుస్తులు మార్చుకుంటుండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన పోకిరీలు
  • ఇద్దరితోపాటు స్టోర్‌ మేనేజర్‌ అరెస్టు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పోకిరీలు రెచ్చిపోతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో యువతులు దుస్తులు మార్చుకుంటుండగా ట్రయల్‌ రూంలో సెల్‌ఫోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇద్దరు పోకిరీలతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్‌ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ఇద్దరు యువతులు జూబ్లీహిల్స్‌లోని హెచ్‌ అండ్‌ ఎం వస్త్ర షోరూంకు వచ్చారు. కావాల్సిన దుస్తులను ఎంపిక చేసుకున్న అనంతరం ఓ యువతి ట్రయల్‌ రూంకు వెళ్లింది. అక్కడే ఉన్న కిరిట్‌ అసాట్‌, గౌరవ్‌ కల్యాణ్‌లు గమనించి పక్కనే ఉన్న మరో రూంలోకి వెళ్లారు. యువతి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌ కెమెరా ద్వారా రికార్డు చేశారు.


సుమారు ఐదు నిమిషాల పాటు చిత్రీకరించాక యువతి సెల్‌ఫోన్‌ను గమనించింది. వెంటనే బయటకు వచ్చి మరో గదిలో ఉన్న యువకులను పట్టుకుంది. స్టోర్‌ నిర్వాహకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోను డిలీట్‌ చేయించారు. అనంతరం బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా,  పోలీసులు నిందితులు కిరిట్‌ అసాట్‌, గౌరవ్‌ కల్యాణ్‌తోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్‌ మేనేజర్‌ అమన్‌లను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-11-06T16:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising