ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంతకష్టం..!

ABN, First Publish Date - 2021-12-26T16:03:31+05:30

అప్పటి వరకు చదువుకుంటున్న ఆ ఇద్దరు స్నేహితుల జీవితాలను చిన్న ఘటన పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఒకరి నిర్లక్ష్యం కారణంగా వారు దివ్యాంగులుగా మారారు. చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లెక్సీ తొలగిస్తుండగా విద్యుదాఘాతం

దివ్యాంగులుగా మారిన ఇద్దరు విద్యార్థులు 

ఒకరికి రెండు చేతులు, మరొకరికి రెండు కాళ్లు.. చేయి తొలగింపు

పట్టించుకోని నేతలు

ఆపన్న హస్తం కోసం బాధితుల ఎదురుచూపులు


హైదరాబాద్/హైదర్‌నగర్‌: అప్పటి వరకు చదువుకుంటున్న ఆ ఇద్దరు స్నేహితుల జీవితాలను చిన్న ఘటన పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఒకరి నిర్లక్ష్యం కారణంగా వారు దివ్యాంగులుగా మారారు.  చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన ఉప్పలయ్య, సైదమ్మ దంపతులు నిజాంపేటకు వలస వచ్చారు. కుమారుడు నవీన్‌(15) ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతిలో చేర్చారు. కూరగాయల వ్యాపారం చేస్తున్న వీరి ఇంటి పక్కనే ఉంటున్న తాళ్లకంపాడు గ్రామానికి చెందిన కూలీలు రవి లలిత దంపతుల కుమారుడు శ్రీకాంత్‌(13)స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 


నవంబర్‌ 14న వీరు చదువుకుంటుండగా.. స్థానికంగా ఉంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అదే డివిజన్‌ నాయకురాలు తన ఇంటిపైకి తరలించాలని పురమాయించింది. వారు దానిని ఇంటిపైకి తీసుకొని వెళ్లే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలకు ఐరన్‌ ఫ్రేం తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని నిజాంపేట రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు శ్రీకాంత్‌కు రెండు చేతులు, నవీన్‌కు రెండు కాళ్లు, ఓ చెయ్యి తీసేశారు. ఆ సమయంలో పార్టీ నాయకులు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం బాధితులకు రూ.10లక్షలు చెల్లించారు.


ఆరోజు నుంచి వారు ఆస్పత్రి వైపు చూడకుండా ముఖం చాటేశారు. నవీన్‌, శ్రీకాంత్‌కు ఒక్కొక్కరికి 10నుంచి 12 ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని, వారి పరిస్థితి ఇప్పటికీ పూర్తిగా మెరుగు పడలేదని వైద్యులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న ఇద్దరు బాలురు దివ్యాంగులుగా మారటం, మరోవైపు ఆస్పత్రి బిల్లు తలకుమించిన భారంగా మారుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో చేర్చిన తరువాత నాయకులెవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. సహాయం అందించాలనుకునే దాతలు నవీన్‌ తండ్రి ఉప్పలయ్య ఫోన్‌ 96405 10031, శ్రీకాంత్‌ తల్లి లలిత ఫోన్‌ 95538 16176 సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-12-26T16:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising