ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితంపై విరక్తితో ఇద్దరు బలవన్మరణం

ABN, First Publish Date - 2021-05-31T17:23:36+05:30

జీవితంపై విరక్తితో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : జీవితంపై విరక్తితో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్‌ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు.. తాగుడుకు బానిసగా మారిన వ్యక్తి, కుటుంబ కలహాలతో దమ్మాయిగూడలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఘనపురం సుమలతకు యాదగిరి (32)తో 2010లో వివాహం జరిగింది. వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న యాదగిరి మద్యానికి బానిసయ్యాడు.


ఈనెల 29న సుమలత తన సోదరి ఇంటికి శుభకార్యానికి వెళ్లగా భర్త యాదగిరి ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సుమలత అతనికి ఫోన్‌ చేసినా తీయలేదని తెలిపాడు. తిమ్మాయిపల్లి కొండల దగ్గర భర్త ఉరేసుకున్నారని తెలియడంతో పోలీసులకు ఆమె సమాచారం అందించింది. మద్యానికి బానిసగా మారడం, ఆర్థిక ఇబ్బందులతోనే ఉరేసుకుని ఉంటారని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ సీఐ మధుకుమార్‌ తెలిపారు. 


కుటుంబ కలహాలతో..

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దమ్మాయిగూడాలో జరిగింది. దమ్మాయిగూడాలోని శ్రీరామచంద్రనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న హరినాగ బాలాజీ శాస్త్రి (28) కుటుంబ కలహాల నేపథ్యంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ సీఐ మధుకుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-05-31T17:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising